టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.బాలకృష్ణ పుస్తకం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు బాలయ్య బాబు.
ఇప్పటికే దాదాపుగా సగం షూటింగ్ వరకు పూర్తి చేసుకుంది ఈ సినిమా.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే మొన్నటి వరకు కూడా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ కూడా సక్రమంగా జరిగాయి.కానీ ఈ సినిమా చివరి షెడ్యూల్స్ కు మాత్రం ఏదో విధంగా అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి.
బ్రేకుల మీద బ్రేకులు పడుతూ ఈ సినిమా షూటింగ్ ముందుకు సాగడం లేదు.ఇది బాలకృష్ణ ఈ సినిమా షెడ్యూల్ కోసం సెప్టెంబర్ లో కొన్ని, అక్టోబర్ లో కొన్ని డేట్స్ ఇచ్చాడట.
కానీ ఈ సమయంలోనే బాలయ్య బాబుకి ఆహా లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షూటింగ్ కారణంగా వీరసింహారెడ్డి షూటింగ్ కి బ్రేక్ పడిందట.
ఈ షో షూటింగ్ తర్వాత వెంటనే బాలకృష్ణ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం ఈ యాడ్ ని కూడా షూట్ చేశాడట.అలా నాలుగు ఐదు రోజులు సమయం తీసుకున్నారట.తర్వాత మళ్లీ మధ్యలో అన్ స్టాపబుల్ ప్రోమో కోసం మళ్ళీ కొన్ని డేట్స్ ఇచ్చాడట బాలయ్య బాబు ఆ విధంగా అన్ స్టాపబుల్ కోసం, యాడ్ షూటింగ్స్ కోసం బాలయ్య బాబు కొన్ని రోజులు సమయం కేటాయించడంతో వీరసింహారెడ్డి సినిమా ఆగిపోయిందట.
అయితే మరొక రెండు మూడు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ను మొదలుపెట్టి తొందర తొందరగా షూట్ చేసి దానిని పూర్తి చేసే పనిలో పడ్డారట మూవీ మేకర్స్.నవంబర్ ఎండింగ్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్లో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొని ఆ తర్వాత ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించడానికి మూవీ మేకర్స్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేపట్టాలి అన్న ఆలోచనలో ఉన్నారట మూవీ మేకర్స్.