మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఆయన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.
బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ నటించిన పాత్ర దాదాపుగా గంట సమయం పాటు స్క్రీన్ పై కనిపిస్తుందని.ఆయన చిరంజీవితో సమానమైన పాత్ర ను మరియు రన్ టైంను కలిగి ఉన్నాడు అంటూ నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ యొక్క పాత్ర నిడివి తగ్గించే ఉద్దేశంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది అంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.
వాల్తేరు వీరయ్య దీపావళి లుక్ అదిరింది.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఈ లుక్ కి ఫిదా అవుతున్నారు.కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకానికి చాలా మంది వచ్చేసారు.
అందుకే సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవికే దక్కాలి అనే ఉద్దేశంతో రవితేజ పాత్రను తగ్గించాలని నిర్ణయించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇలాంటి పుకార్లు ఎన్నో వస్తూనే ఉంటాయి, కానీ ఇప్పటి వరకు అలాంటి విషయమై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.

ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసిన రవితేజ ఇప్పుడు పాత్ర నిడివి తగ్గించడం ఎలా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి తన పాత్ర కోసం తన ఇమేజ్ కోసం వేరే హీరో యొక్క పాత్రను తగ్గించే అంత తక్కువ స్థాయి వ్యక్తి కాదు అంటూ కొందరు మెగా అభిమానులు ఈ పుకార్లను కొట్టివేసి ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా రకాలుగా వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.కొత్తగా వస్తున్న ఈ పుకారు కూడా అవాస్తవం అయ్యి ఉంటుంది అంటూ మెగా ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు.
చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని ప్రతి ఒక్కరూ ఉంటాయని చాలామంది విశ్వసిస్తున్నారు.







