గోపీచంద్ మలినేని డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న వీర సిం హా రెడ్డి సంక్రాంతి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో బాలయ్య ఊర మాస్ యాటిట్యూడ్ తో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నారు.
వీర సింహా రెడ్డి సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో థమన్ మ్యూజిక్ కి మరోసారి ఫ్యాన్స్ ఫిదా అవుతారని తెలుస్తుంది.
ఈమధ్య వచ్చిన టీజర్ కే నందమూరి ఫ్యాన్స్ ఎక్సయిట్ అయ్యారు.అయితే లేటెస్ట్ గా థమన్ అది శాంపిల్ మాత్రమే అని అసలు సినిమా వేరే ఉంటుందని.
థియేటర్ లో వీర మోత మోగిపోతుందని అన్నారు.ఈ ట్వీట్ నందమూరి అభిమానులకు మరింత జోష్ ఇచ్చింది.
అఖండ సినిమాకు థమన్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది.ఇక ఇప్పుడు వీర సింహా రెడ్డికి కూడా థమన్ అదరగొడతాడని ఫిక్స్ అవ్వొచ్చు.సంక్రాంతికి వాల్తేరు వీరయ్యకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండగా వీర సిం హా రెడ్డి సినిమాకు థమన్ ఇరదీస్తున్నాడు.హీరోల మధ్య మాత్రమే కాదు మ్యూజిక్ డైరక్టర్స్ మధ్య కూడా పోటీ ఏర్పడిందని చెప్పొచ్చు.