ఒక సినిమా విజయవంతం అవ్వాలంటే క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలి.సినిమా తీసే దర్శకుడికి, నిర్మాతకి, హీరో, హీరోయిన్స్ కి, 24 శాఖల్లో పని చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో క్రమశిక్షణతో, కట్టుదిట్టంగా పనిచేస్తేనే సినిమా అవుట్ పుట్ చక్కగా వస్తుంది.
కానీ డిసిప్లిన్ ఓ సినిమా ద్వారా తన కెరీర్ ను కోల్పోయాను అంటుంది ప్రేమిస్తే సినిమా హీరోయిన్ సంధ్య.మలయాళ కుటుంబంలో జన్మించిన సంధ్య తమిళ సినిమా అయినా కాదల్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఈ సినిమా పలు భాషల్లో డబ్బింగ్ కాగా అన్ని భాషల్లోనూ సంధ్య మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.కానీ మొదటి సినిమా తో వచ్చిన క్రేజ్ తో అంతే మంచి స్టార్ హీరోయిన్ అవ్వడం లో మాత్రం సంధ్య విఫలమైందనే చెప్పాలి.
దానికి గల కారణం ఆమె తన మొదటి సినిమా హిట్ కాగానే రెండవ సినిమా నుంచి అన్ని చెల్లెలు పాత్రలు ఎంచుకోవడమే.చివరికి తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన అన్నవరం అనే సినిమాలో సైతం సంధ్య చెల్లెలి పాత్ర పోషించింది.
తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించిన సంధ్య ప్రతి భాషలోనూ చెల్లెలి పాత్రలకి పరిమితం అయింది.దాంతో స్టార్ హీరోయిన్ గా లేదంటే రొమాంటిక్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం లేకుండా పోయింది సంధ్యకి.
అయితే ఆమె నటించినా మూడవ సినిమా వల్లవన్ సినిమా షూటింగ్ సమయంలో ఆమె అనేక దారుణ సంఘటనను ఎదురుకున్నానని చెబుతోంది.

తమిళ హీరో శంబు స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన సినిమా వల్లవన్.ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్కడ ఒక్కరికి కూడా క్రమశిక్షణ లేదని 9 గంటలకు మొదలు కావలసిన ఫస్ట్ సీన్ షూటింగ్ పదకొండు గంటల వరకు కూడా మొదలు కాదని, చెప్పిన కథకి తీసిన సినిమాకి సంబంధం లేదని సంధ్య వాపోయింది.ఇక శంభు లాంటి చెత్త వ్యక్తిని తన ఎక్కడా చూడలేదని, ఈ సినిమా విడుదలైన 12 ఏళ్లకు సంధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ద్వారా పెను దుమారమే లేపింది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరమై ఇద్దరు పిల్లలు తల్లిగా ఉన్న సంధ్య ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.ఇక పై సినిమాల్లో నటించే అవకాశం లేదంటూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్ని అవకాశాలు వచ్చిన తోసిపుచ్చుతూ తన జీవితాన్ని తాను గడుపుతుంది
.






