అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయానికి కోడికత్తి శీను కుటుంబం. లాయర్ సలీమ్ తో పాటు శీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు.
నాలుగేళ్ళుగా రిమాండ్ ఖైదీగా ఇబ్బందులు పడుతుండడంతో తమ గోడు సిఎం చెప్పుకుంటామంటున్న శీను కుటుంబం.సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గిరా స్పందనలో పిటిషన్ ఇచ్చిన శ్రీను కుటుంబం.
వైఎస్ జగన్ పై కోడికత్తి తో దాడి చేసిన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ కోసం ప్రయత్నాలు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసేందుకు న్యాయవాదితో కలసి తాడేపల్లి వచ్చిన నిందితుడి తల్లి జనిపల్లి సావిత్రి.
స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వినతి పత్రం ఇచ్చిన నిందితుడి కుటుంబం.తనకుమారుడి బెయిల్ కోసం నిరభ్యంతర పత్రం ఇవ్వాలని సీఎం జగన్ కు నిందితుడి తల్లిదండ్రుల లేఖ.నాలుగేళ్లుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కోడికత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు. కుమారుడు జైలు పాలైనందున తాము కష్టాలు పడుతున్నట్లు లేఖలో సీఎంకు తెలిపిన నిందితుడి తల్లిదండ్రులు.
వయోభారంతో ఉన్న తమ పోషణ కష్టంగా మారిందని జాలి చూపాలని సీఎంకు నిందితుడి తల్లిదండ్రుల వినతి.