బంపర్ ప్రైస్: రూ.3 లక్షలకే మహీంద్రా ఎలక్ట్రిక్ కారు సొంతం చేసుకోండిలా?

అవును, మీరు విన్నది నిజమే.మీ కలల కారుని రూ.3 లక్షలకే సొంతం చేసుకోండి.మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లోకి త్వరలో తీసుకురాబోతోంది.

 Bumper Price: Should You Own A Mahindra Electric Car For Rs.3 Lakh , Bumper Offe-TeluguStop.com

ఇది ఒక స్మాల్ ఎలక్ట్రిక్ కారు.దీనికి మహీంద్రా ఆటమ్ అని నామకరణం చేసారు.

త్వరలోనే మహీంద్రా కంపెనీ ఈ స్మాల్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి లాంచ్ చేయనుంది.ఏకక్ట్రిక్ కారుని తక్కువ ధరకే పొందాలనుకునేవారు ఇప్పుడే బుక్ చేసుకుంటే ఉత్తమం.

మహీంద్రా 2020 ఆటో ఎక్స్‌పోలో ఈ కారును ప్రదర్శించిన సంగతి విదితమే.

కానీ కోవిడ్ 19 కారణంగా ఈ కారు ఆవిష్కరణ ఆలస్యం అవుతూ వచ్చింది.

అయితే త్వరలోనే కంపెనీ ఈ వెహికల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది.మహీంద్రా ఆటమ్ మార్కెట్‌లోకి వస్తే.

దేశంలోని తొలి ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ ఇదే కావడం గ్యారంటీ.ఇటీవలనే ఈ వెహికల్‌కు అప్రూవల్ సర్టిఫికెట్ కూడా లభించింది.

పాత సర్టిఫికెట్‌ పరంగా చూస్తే.దీన్ని నాన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో ఉంచారు.

అయితే ఇప్పుడు దీన్ని ట్రాన్స్‌పోర్ట్ విభాగం కిందకు తెచ్చారు.మహీంద్రా ఆటమ్ ప్రధానంగా నాలుగు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు లభించే అవకాశం ఉంది.

Telugu Lakhs, Anandh Mahindra, Bumper, Electric Car, Mahindra Atom-Latest News -

K1, K1, K3, K4 అనే వేరియంట్లలో వస్తోంది. K1, K2 వేరియంట్లలో 7.4 KWH, 144 AH బ్యాటరీ ఉండొచ్చు.ఇక ఆటమ్ K3, K4 వేరియంట్లలో 11.1 KWH, 216 AH బ్యాటరీ ఉండొచ్చు.K1, K2 వెరియంట్లను ఒక్కసారి ఫుల్‌గా చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం కలదు.ఇక K3, K4 వేరియంట్లు అయితే ఒక్కసారి చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు మేర ప్రయాణం చేయొచ్చు.K1, K3 వేరియంట్లు ఎయిర్‌ కండీషనింగ్ ఫీచర్‌తో మార్కెట్‌లోకి వస్తాయి.అయితే నాన్ AC వేరియంట్ వల్ల ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు.ఈ స్మాల్ కారు చూడటానికి చిన్నదిగా ఉంటుంది, మరియు ఇందులో 4 సీట్లు కలవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube