కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా రూపొందిన కాంతార చిత్రం మంచి కలెక్షన్స్ నమోదు చేసింది.కన్నడ నాట అత్యధిక వసూళ్ల ను నమోదు చేసిన టాప్ చిత్రాల జాబితాలో నిలిచింది.
అంతే కాకుండా ఈ సినిమాను కన్నడంలో అత్యధిక జనాలు చూసిన సినిమాగా కూడా రికార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇక కాంతార తెలుగు వర్షన్ విషయానికి వస్తే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ నమోదు అవుతున్నాయని పాతిక కోట్ల రూపాయలు… 50 కోట్ల రూపాయలు ఈ సినిమా నమోదు చేసింది అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే ఈ సినిమా డబ్బింగ్ సినిమాల జాబితాలో టాప్ టెన్ లో నిలిచింది అంటూ చాలా మంది బలంగా వాదిస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే ఈ సినిమా ఇప్పటి వరకు 16 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని నమోదు చేసింది.
ఇక డబ్బింగ్ సినిమాలు తెలుగు లో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న జాబితా విషయానికి వస్తే ఈ సినిమా 13వ స్థానం లో ప్రస్తుతం ఉంది.మరో వారం రోజుల పాటు ఈ సినిమా ఆడే అవకాశం ఉంది.
కనుక టాప్ 10 లో ఈ సినిమా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాంతారా సినిమా ను తెలుగు లో ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కనుక మాస్ సినిమాల స్థాయిలో ఈ సినిమా పదుల కోట్ల కలెక్షన్స్ ని నమోదు చేయలేక పోతుంది.అయినా కూడా ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ చాలా గొప్ప కలెక్షన్స్ అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
కన్నడం లో సూపర్ హిట్ అయినా సినిమాల్లో కొన్ని మాత్రమే తెలుగులో భారీ వసూళ్లను నమోదు చేస్తున్నాయి.అందులో కాంతార సినిమా ఒకటి అంటూ నిలిచింది అనడంలో సందేహం లేదు.







