జాతి రత్నాలు సినిమా తో హీరో గా నవీన్ పోలిశెట్టి దర్శకుడిగా అనుదీప్ హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా మంచి పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో వీరు ముగ్గురు కూడా స్టార్స్ గా నిలిచారు.
కానీ ఆ తర్వాత అదృష్టం సమయం కలిసి రావడం లేదా అనిపిస్తుంది.జాతిరత్నాలు సినిమా విడుదలైన తర్వాత నవీన్ పోలిశెట్టి ఇప్పటి వరకు ఒక్క సినిమా తో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేక పోయాడు.
ఆయన ప్రస్తుతం చేస్తున సినిమాల్లో సక్సెస్ దక్కించుకునే సినిమాలు ఉన్నాయా లేదా అనేది క్లారిటీ లేదు.ఇక దర్శకుడు అనుదీప్ ఆ మధ్య కథ స్క్రీన్ ప్లే అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఆ తర్వాత ప్రిన్స్ సినిమా తో దర్శకుడి గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.శివ కార్తికేయన్ హీరో గా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.ఇక హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విషయానికి వస్తే ఆమె చాలా అందం గా ఉన్నా కూడా కాస్త హైట్ ఎక్కువ అవ్వడం వల్ల కొద్ది మంది హీరోలకు ఆమె సెట్ అవ్వడం లేదు అనే టాక్ వచ్చింది.
వచ్చిన అడపా దడప్ప ఆఫర్స్ తో కెరియర్ ని నెట్టుకొస్తుంది.తాజాగా సంతోష్ శోభన్ హీరో గా నటించిన లైక్ షేర్ సబ్స్క్రయిబ్ సినిమా తో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ తాజాగా విడుదలైంది.ట్రైలర్ లో ఈ అమ్మడికి మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కిందని అనిపిస్తుంది.
మరి ఈ సినిమా తో అయినా ఫిరియా అబ్దుల్లా మంచి గుర్తింపును దక్కించుకొని వరుసగా ఆఫర్స్ ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.







