కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన తాజా చిత్రం కాంతార.ఈ సినిమా అన్ని భాషలలో విడుదలయ్యి ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమాపై ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం కాంతార సినిమాపై స్పందిస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఈయనపై నేటిజన్స్ తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ కిరణ్ అబ్బవరం సినిమా గురించి స్పందిస్తూ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని వస్తే.
ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం ట్వీట్ చేస్తూ నేను చిన్నప్పటి నుంచి మా ఊరిలో చూసినటువంటి ఇలాంటి కల్చర్ స్క్రీన్ పై చూడటం చూడటం చాలా బాగా అనిపించింది అంటూ ఈయన కాంతార సినిమా గురించి ట్వీట్ చేశారు.అయితే ఈయన చేసిన ట్వీట్లు ఏ విధమైనటువంటి తప్పు లేకపోయినప్పటికీ ఈయన చేసిన ట్వీట్ పై స్పందిస్తూ నీది రాయచోటి కదా బ్రో.కోలం’ కర్ణాటక బోర్డర్‌లో కదా జరిగేదంటూ’ మరో నెటిజన్ కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈయన ట్వీట్ పై మరికొందరు స్పందిస్తూ ప్రస్తుతం నువ్వు చేసే సినిమాలన్నీ కూడా మానేసి ఇలా కొత్తగా ఏదైనా ట్రై చెయ్ అంటూ సలహాలు ఇస్తున్నారు.హో.గ్రేట్ అన్నా నువ్వు సినిమాలు చేయడం ఎప్పుడు మానేస్తున్నావు అంటూ పలువురు నెటిజన్లు ఈయన చేసిన ట్వీట్ పై నెగిటివ్ గా స్పందిస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా గురించి కిరణ్ అబ్బవరం పాజిటివ్ గా స్పందించిన ఆయనకు మాత్రం నెగిటివ్ విమర్శలు తప్పడం లేదు.







