అన్నమయ్య జిల్లా రాజంపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ లో నిధులు గోల్మాల్ అయినట్లు తెలుస్తోంది.రూ.40 లక్షలు పోస్టర్ అసిస్టెంట్ విష్ణువర్ధన్ మాయం చేశారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.వినియోగదారుల ఖాతాల నుంచి సుమారు 40 లక్షలకు పైగా స్వాహా చేసినట్లు చెబుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.దీనిలో భాగంగా విష్ణువర్ధన్ సహా అతని సోదరుడు హేమంత్ ను ప్రశ్నిస్తున్నారు.







