మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమా ఏ జానర్ మూవీనో చెప్పలేకపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో మంచు విష్ణుపై ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.కొంతమంది మంచు విష్ణు కుటుంబంపై కూడా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే జిన్నా సినిమాలో తనను, తన కుటుంబాన్ని ట్రోల్ చేసేవాళ్లకు మంచు విష్ణు షాకింగ్ కౌంటర్ ఇవ్వగా ఆ కౌంటర్ హాట్ టాపిక్ అవుతోంది.“నన్ను ట్రోల్ చేస్తే వదిలేస్తాను కానీ నా వాళ్ల జోలికొస్తే ఊరుకోను” అని మంచు విష్ణు సినిమాలో చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్ అవుతోంది.తన గురించి, ఫ్యామిలీ గురించి వస్తున్న ట్రోల్స్ విష్ణు ఒకింత సీరియస్ గా ఉన్నారని ఆయన కామెంట్ల ద్వారా అర్థమవుతోంది.

మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.మంచు విష్ణు గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా బెటర్ టాక్ ను సొంతం చేసుకుంది.జిన్నా సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాలి.
ఈ సినిమాతో ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయమయ్యారు.ఇషాన్ సూర్య తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.మరోవైపు మంచు విష్ణు నిదానంగా సినిమాలు తీయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.పరిమిత బడ్జెట్ లోనే సినిమాలను నిర్మిస్తూ తన సినిమాలకు నష్టాలు రాకుండా విష్ణు జాగ్రత్త పడుతున్నారు.







