కన్నడ దర్శక నటుడు రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన చిత్రం కాంతార.ఇటీవల విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.అంతేకాకుండా.ఇందులో భూత కోలా అనే ఒక సంస్కృతికి కమర్షియల్ అంశాలను మేళవించి రూపొందించారు.కేవలం కన్నడ ప్రజలకే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది.ఈ కాంతార సినిమా ద్వారా కన్నడ ప్రజలకు ఒక మాత్రమే కాకుండా దేశ ప్రజలకు తెలిసిన ఒక పురాతనమైన ఆచారం భూత కోలా.
ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ సీన్ లో రిషబ్ శెట్టి వేషధారణ, నృత్యం, హావభావాలు అరుపులతో ప్రేక్షకులను కట్టిపడేశారు.అయితే ఇదొకరకమైన భూతారాధన అని చెప్పవచ్చు.మంగళూరు, ఉడిపి, కుందాపుర వంటి కర్ణాటకలోకి దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఈ ఆరాధన మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతం లో కూడా జరుపు కుంటారు.
వరాహం ఆత్మను పూజిస్తూ జరుపుకుంటారు.ఈ పండుగకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి.
కాంతార సినిమా తరువాత ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ వీడియోలలో వాయిద్యాల శబ్దాలు, దైవ నర్తకుల నృత్యాలు చూస్తుంటే కాంతార సినిమాలో రిషబ్ శెట్టి అచ్చం దించేశారుగా అనిపిస్తుంది.అయితే తాను చిన్నప్పటి నుంచీ చూస్తున్న ఆచార సంప్రదాయాలనే కాంతార సినిమాలో చూపించానని ఇప్పటికే రిషబ్ శెట్టి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.అయినప్పటికీ రిషబ్ శెట్టి వెండితెరపై పండించిన తీరు వేరు.
యూట్యూబ్ లో ఉన్న రియల్ వీడియోలలో, అలాగే రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతారా సినిమాలో కూడా అదే కనిపిస్తోంది.కాని సినిమాలో అడవిలో ఈ జాతర నిర్వహిస్తారు.
యూట్యూబ్‌లో ఉన్న వీడియోల్లో ఆ వాతావరణం కనిపించడం లేదు.







