ప్రముఖ టూ వీలర్స్ తయారీదారు టీవీఎస్ ఇండియాలో ఎప్పటికప్పుడు సరికొత్త బైక్స్ లాంచ్ చేస్తోంది.తాజాగా మరో కొత్త బైక్‌ను ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
గతంలోనే 125 సీసీ ఇంజన్‌తో టీవీఎస్ రైడర్ బైక్‌ను తీసుకొచ్చిన ఈ కంపెనీ ఇప్పుడు దానికే మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను యాడ్ చేసి కొత్తగా రైడర్ 125ను పరిచయం చేసింది.ఇంజన్‌లో ఎలాంటి కొత్త మార్పులు తీసుకు రాలేదు కానీ చాలా టెక్నికల్ ఫీచర్లను అందించింది.ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు దీనిని రూ.99,999 (ఎక్స్‌షోరూమ్)కి సొంతం చేసుకోవచ్చు.కాగా ఇప్పటికే ఈ బైక్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
కొత్త రైడర్ 125 అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఒక్కసారి చూసుకుంటే ఇందులో నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్, స్పోర్ట్స్ అప్‌డేట్స్, వాయిస్ అసిస్టెంట్, కాల్ మేనేజ్‌మెంట్, అండర్ సీట్ స్టోరేజీ, యూఎస్‌బీ ఛార్జర్, సైడ్ స్టాండ్ ఇండికేషన్ అండ్ ఇంజన్ కటాఫ్, హెల్మెట్ అటెన్షన్ ఇండికేషన్ వంటి ఎన్నో ఫీచర్లున్నాయి.
అలానే ఇందులో టైమ్, ట్రిప్ మీటర్, ఓడో మీటర్, ఫ్యూయల్, యావరేజ్ స్పీడ్, రైడింగ్ మోడ్, గేర్ పొజిషన్ చూపించే 5 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్సుస్ట్రుమెంట్ క్లస్టర్ ఆఫర్ చేశారు.వాహనదారులు టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ సహాయంతో మరిన్ని స్మార్ట్ ఫీచర్లు యాక్సెస్ చేయవచ్చు.

ఇక ఇంజన్ విషయానికొస్తే ఇది 124.8 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజన్‌తో చక్కటి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది.దీని పవర్ గురించి తెలుసుకుంటే ఇది 11.4 హెచ్‌పీ పవర్, 11.2 ఎన్‌ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ పవర్‌తో ఈ బైక్ జస్ట్ 5.9 సెకన్లలోనే 0-60 స్పీడ్ చేరుకుంటుంది.గరిష్ఠంగా 99 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తుంది.5 స్పీడ్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది నడుస్తుంది.దీనిలో ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఇవ్వడం మరో విశేషం.
లైటింగ్ విషయానికొస్తే.ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్‌ను మీరు పొందొచ్చు.
డిస్క్, డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో ఈ బైక్ వస్తోంది.నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.







