యూట్యూబ్ వీడియోలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దివి ఒకరు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత ఆదరణ పొందారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దివి మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ద్వారా ఈమె మరింత గుర్తింపు సంపాదించుకుంది.
ఇకపోతే ఈ సినిమా అనంతరం వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ బ్యూటీ తన ఫేవరెట్ హీరో గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమైన హీరో అని తెలిపారు.తాను ఏంటెక్ చదువుతున్న సమయంలో ఇంస్టాగ్రామ్ ద్వారా హీరో ప్రభాస్ కి ఒక మెసేజ్ చేశానని తెలిపారు.

ఇంస్టాగ్రామ్ ద్వారా తనతో కలిసి డేటింగ్ కి వెళ్లాలని ఉంది అంటూ ప్రభాస్ కి రిప్లై ఇచ్చానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా దివి వెల్లడించారు.అయితే ప్రభాస్ నుంచి తనకు ఏ విధమైనటువంటి రిప్లై రాలేదని ఈమె తెలియజేశారు.అయితే తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని ఆయన నటించిన సినిమాలు ఏది మిస్ కాకుండా చూస్తానని దివి ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రభాస్ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చిన తాను ఏమాత్రం వదులుకోనని ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







