దశకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ఆస్కార్ అవార్డు కోసం పెద్ద ఎత్తున పోటీపడుతోంది.ఇక త్వరలోనే ఈ సినిమాని జపాన్ లో విడుదల చేయబోతున్నారు.
అక్టోబర్ 21వ తేదీ ఈ సినిమా జపాన్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే చిత్ర బృందం జపాన్ చేరుకున్నారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రామ్ చరణ్ వారి ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్లారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన దంపతులు తాజాగా జపాన్ లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ దిగినటువంటి ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తన స్నేహితులతో కలిసి ఉపాసన దంపతులు జపాన్ లోకల్ ఫుడ్ టేస్ట్ చేస్తూ సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో రాజమౌళితో పాటు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి కూడా జపాన్ కి వెళ్లారు.ప్రస్తుతం చిత్ర బృందం మొత్తం జపాన్ లో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మరి ఇక్కడ ఈ సినిమా ఎలాంటి ప్రశంసలు అందుకుంటుందో తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించిన సందడి చేశారు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.







