ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తల మధ్య అనేక గొడవలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.వివాహ వ్యవస్థ చాలా బలహీనంగా మారిపోయింది.
ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు.విడాకులు ఎక్కువైపోయాయి.
భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడ తగ్గే పరిస్థితి లేకుండా ఎవరి పంతాన్న వారు నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబాలను కూల్చేసుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే భార్యను హత్య చేసిన కేసులో భర్తకు కిందికోటు విధించిన జీవిత ఖైదు శిక్షను హైకోర్టు రద్దు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
విషయంలోకి వెళ్తే 2016వ సంవత్సరంలో చిక్క మగుళ్లురు జిల్లా మూడిగేరేలో వినాయక చవితి రోజు భార్య రాధా ఇంట్లో వంట చేయకుండా మద్యం తాగి పడుకుంది.
ఆ సమయంలో బయట నుండి ఇంటికి వచ్చిన భర్త సురేష్ ఆగ్రహం తెచ్చుకుని కోపోద్రిక్తుడై.భార్యని కట్టెతో కొట్టడంతో ఆమె మృతి చెందింది.2017వ సంవత్సరంలో స్థానిక కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష విధించగా అప్పటినుంచి జైల్లోనే ఉంటూ ఉన్నాడు.
ఈ క్రమంలో సురేష్ తీర్పును కర్ణాటక హైకోర్టులో ఆపిల్ చేశాడు.
మంగళవారం కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు… భర్త ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని న్యాయస్థానం భావిస్తున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు.కాబట్టి హత్యా నేరం సెక్షన్ తొలగించాలని స్పష్టం చేశారు.
అంతేకాదు ఇప్పటికే అతడు 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడంతో అతనిపై ఎటువంటి కేసులు లేకపోవడంతో తక్షణం జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.