కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ “భారత జూడో” పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు జరగనున్న ఈ పాదయాత్ర ఏపీలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని పేర్కొన్నారు.
కర్నూలులో జరుగుతున్న ఈ యాత్రలో అమరావతి రైతులు రాహుల్ గాంధీని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా తమ సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకువచ్చిన అమరావతి రైతులు వారు చెప్పింది అంతా విని ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.అంతేకాకుండా కుదిరితే అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో కూడా పాల్గొంటానని అమరావతి రైతులకు రాహుల్ హామీ ఇవ్వడం జరిగింది.







