మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో గుర్తులపై తెలంగాణ హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.తమ పార్టీ గుర్తు కారును పోలిన ఎనిమిది గుర్తులు ఉన్నాయని, వాటిని తొలగించాలని న్యాయస్థానాన్ని కోరింది.
అయితే, టీఆర్ఎస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది.ఇప్పటికే ఈ విషయంపై ఈసీని కలిసినా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.
అయితే ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టలేమన్న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్.రేపు విచారణ జరుపుతామని వెల్లడించారు.
గత ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని టీఆర్ఎస్ చెబుతోంది.
.






