ఆండ్రాయిడ్‌, క్రోమ్‌ యూజర్లకు శుభవార్త... గూగుల్‌ అందిస్తున్న ఈ ఫీచర్ గురించి తెలుసా?

పాస్‌వర్డ్స్‌ మర్చిపోతే డిజిటల్ అకౌంట్స్‌లో లాగిన్ కావడం చాలా కష్టం.ఈ పాస్‌వర్డ్స్‌ ఇతరుల చేతిలో పడితే ప్రైవేట్ డేటా మొత్తం రిస్క్‌లో పడిపోతుంది.

 Google Introduces Passwordless Login Passkey For Android Chrome Users Details, G-TeluguStop.com

మరి ఇలాంటి ఇబ్బందులతో వచ్చే పాస్‌వర్డ్స్‌ లేకపోతే చాలా బాగుంటుంది కదా.నిజానికి ఇంటర్నెట్‌లో ఎక్కడా కూడా అకౌంట్స్‌లో లాగిన్ కావడానికి పాస్‌వర్డ్స్‌ ఉపయోగించాల్సిన అవసరమే లేకపోతే సేఫ్టీ కూడా పెరుగుతుంది.ఈ ఆలోచన చేసిన చాలా టెక్ కంపెనీలు పాస్‌వర్డ్‌లెస్ అథెంటికేషన్ తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి.ఇందులో భాగంగా గూగుల్ తాజాగా ఆండ్రాయిడ్, క్రోమ్‌ డివైజ్‌లకి పాస్‌కీ లాగిన్లను పరిచయం చేసింది.

ప్రస్తుతం వాడుతున్న పాస్‌వర్డ్‌కు బదులుగా మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లోని బిల్ట్-ఇన్‌ అథెంటికేషన్ సిస్టమ్‌లతో లాగిన్ కావడానికి ఈ పాస్‌కీలు ఉపయోగపడతాయి.కాగా పాస్‌కీలు ప్రస్తుతానికి టెస్టింగ్ నిమిత్తం డెవలపర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.

సాధారణంగా ఒక సైట్ లేదా యాప్‌కి లాగిన్ అవుతున్నప్పుడు ఆటోఫిల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.దీని పై క్లిక్ చేయడం ద్వారా పాస్‌వర్డ్స్‌ టైప్ చేయకుండానే లాగిన్ కావడం సాధ్యమవుతుంది.

Telugu Andriod, Android Chrome, Chrome, Google, Passkey, Passkey Login, Password

పాస్‌కీ కూడా అచ్చం ఇదే విధంగా పనిచేస్తుంది.అయితే ఇక్కడ పాస్‌కీ లాగిన్ సమయంలో ఒక పిన్ లేదా బయోమెట్రిక్ వివరాలు యూజ్ చేస్తుంది.యాపిల్, మైక్రోసాఫ్ట్ తమ ఓఎస్‌లకు ఈ ఫీచర్‌ను తీసుకురావడానికి ఇప్పటికే పనులు ప్రారంభించాయి.పాస్‌కీలు ఫోన్ లేదా కంప్యూటర్ వంటి డివైజ్‌లో స్టోర్ అయ్యే ఒక క్రెడెన్షియల్‌.

ఇది వెబ్‌సైట్ లేదా అప్లికేషన్‌కు మీరే లాగిన్ అవుతున్నారనే విషయాన్ని నిర్ధారిస్తుంది.దీని సహాయంతో పాస్‌వర్డ్‌ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా సైట్‌లు, సేవలకు సురక్షితంగా లాగిన్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube