మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ అంటే తనకు అమితమైన అభిమానం ఇష్టమని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పేర్కొన్నారు.నెల్లూరు ఆదిత్య నగర్ లోని ఎస్పీ బాలసుబ్రమణ్యం మున్సిపల్ పార్కును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నెల్లూరు ప్రజల అభిమానం మర్చిపోనని వారి అభిమానంతోనే నేటికీ కూడా లైవ్ స్ట్రీమ్ లో ఉన్నానని ఆయన కృతజ్ఞతలు.
ఎమ్మెల్యే అనిల్ ను కలవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
చిన్నతనంలోనే ఆయన చేస్తున్న కార్యక్రమాలు, అభివృద్ధి ఎంతోమందికి ఆదర్శమన్నారు.తాను నెల్లూరు అల్లుడినని పొలిటికల్ రంగంలో అనిల్ పవర్ స్టార్ అని పేర్కొన్నారు.
రాజ్ కోటిగా తాము సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమాను చూసిన నెల్లూరు ప్రజలు మ్యూజిక్ ఏం కొట్టారురా… అంటూ ఆరోజు తమను ఆదరించారని ఆదే ఆదరణ నేటికి కూడా కొనసాగుతుందన్నారు.