తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది నిర్వహించే పరీక్షలను శాతం సిలబస్‌తో నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ మేరకు వంద శాతం సిలబస్‌తో కూడిన ఇంటర్ ప్రశ్నాపత్రాలను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటించారు.అయితే, కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా 70 శాతం సిలబస్‌తోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.
కరోనా ప్రభావం అంతగా కనిపించని నేపథ్యంలో ఇంటర్ బోర్డు వంద శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.