టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే విడుదల ఈ మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.దసరా పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతున్నడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ లో భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పల ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ నేపథ్యంలో ఒక విలేకర్.ఇటీవల గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి సార్ అని చిరంజీవిని.ప్రశ్నించగా వెంటనే స్పందించిన చిరంజీవి.ఆయన పెద్దాయన.
ఆయన చేసిన వ్యాఖ్యల పై చర్చించుకోవాల్సిన అవసరం లేదు అంటూ సున్నితంగా చెబుతూనే ఆ వివాదానికి పులిస్టాప్ పెట్టేసారు చిరంజీవి.మరి ఇప్పటికైనా మెగాస్టార్ అభిమానులు ఈ మాటలు విని గరికపాటి పై ట్రోలింగ్స్ కామెంట్ చేయడం ఆపేస్తారో లేదో చూడాలి మరి.ఇక ఇటీవలే హైదరాబాదులో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి పై గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడడంతో అప్పటినుంచి గరికపాటి పై మెగాస్టార్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.https://telugustop.com/wp-content/uploads/2022/10/chiranjeevi-garikapati-narasimha-rao-1.jpg
అయితే అవివాదంపై చిరంజీవి పెద్దగా స్పందించకపోయినా కూడా అభిమానులు మాత్రం గరికపాటి పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ అతని పేరుని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ట్రోలింగ్స్ చేశారు.అంతేకాకుండా గరికపాటిని చిన్న గడ్డి పాసు అంటూ కూడా ఏకీ పారేశారు.అభిమానులతో పాటు నెటిజన్స్ అలాగే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ గరికపాటిని తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే.
మరి ఇప్పటికైనా చిరంజీవి పై ఉన్న అభిమానంతో గరికపాటి పై ట్రోలింగ్స్ చేయడం ఆపేస్తారో లేదో చూడాలి మరి.ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజెన్స్ ఇప్పటికే గరికపాటి గారికి జరగాల్సిన అవమానం జరిగిపోయింది ఎప్పుడు స్పందించి ఏం లాభం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.