టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి నువ్వే నువ్వే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు.ఈ సినిమాలో తరుణ్ శ్రేయ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో చిత్ర బృందం నగరంలోని ఎ.ఎం.బి.సినిమాస్‌లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించింది.ఈ కార్యక్రమంలో భాగంగా దర్శక నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్లు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు వంటి తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.వనమాలి హౌస్ లో నువ్వే కావాలి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను నిర్మాత స్రవంతి రవి కిషోర్ గారు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆయనకు నువ్వే నువ్వే సినిమా కథ చెప్పాను.
వెంటనే ఆయన చెక్ బుక్ తీసి నువ్వే కావాలి సినిమాకు కథ రాసినందుకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో నువ్వే నువ్వే సినిమాకి కూడా అంతే రెమ్యూనరేషన్ అడ్వాన్స్ గా ఇచ్చారు.ఆ డబ్బుతో నేను బైక్ కొన్నానని త్రివిక్రమ్ తెలిపారు.

ఇక ఈ సినిమా అన్ని అనుకున్నట్టుగా జరగడం ఎంతో ఘనంగా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుందని తెలిపారు.ఇకపోతే ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ శ్రోతలు ఎంతగానో ఇష్టపడుతున్నారు.ఇలాంటి అద్భుతమైన పాటలను ఈ సినిమాకి అందించిన సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.‘గాలిపటం గగనానిదా? ఎగరేసే నేలదా?’ అని రాసిన శాస్త్రి గారి గురించి ఏం చెప్పాలి అంటూ త్రివిక్రమ్ సిరివెన్నెల గురించి మాట్లాడుతూ…ఈ సినిమాని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అంకితం ఇచ్చారు.







