ఇండియాలో సరోగసి బ్యాన్.. సంచలన ట్వీట్ చేసిన గృహలక్ష్మి కస్తూరి?

ఈమధ్య కాలంలో వైద్యరంగంలో ఎంతో అభివృద్ధి చెందడంతో చాలామంది సెలబ్రిటీలు పిల్లలను స్వయంగా నవ మాసాలు మోసి కనకపోయినా సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కంటున్నారు.ఈ విధంగా ఎంతోమంది సెలబ్రిటీలు సరోగసి పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా మారారు.

 Surrogacy Ban In India Grilakshmi Kasturis Sensational Tweet Surrogacy , Grilaks-TeluguStop.com

తాజాగా నయనతార విగ్నేష్ దంపతులు సైతం ఇద్దరు కవల మగ బిడ్డలకు తల్లిదండ్రులు అయ్యారనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్నటువంటి నయనతార జూన్ 9వ తేదీ తనని వివాహం చేసుకున్నారు.

ఈ విధంగా పెళ్లయిన నాలుగు నెలలకే తల్లిదండ్రులయ్యామంటూ వీరిద్దరూ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఇది తెలిసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కస్తూరి.ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా ఈ ట్వీట్ పై పలువురు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇండియాలో సరోగసి పై బ్యాన్ ఉంది. వైద్యపరంగా కొన్ని అనివార్య కారణాల కోసం తప్ప సరోగసి పద్ధతిని ఉపయోగించకూడదు.ఒక మహిళలో తల్లి అయ్యే విషయంలో లోపం తలెత్తితేనే ఇలా సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వాలి.అంతేకానీ సరోగసిని ప్రోత్సహించకూడదు ఈ చట్టం 2022 నుంచి అమలులోకి వచ్చింది రాబోయే రోజుల్లో దీని గురించి మనం ఎంతో వింటాం అంటూ ఈమె ఎక్కడ నయనతార విగ్నేష్ పేర్లను ప్రస్తావించకుండా చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ విషయంపై కొందరు స్పందిస్తూ. ముందు నీ పని నువ్వు చూసుకో అంటూ కామెంట్లు చేయగా, ఈ కామెంట్లపై కూడా కస్తూరి స్పందించారు.లాయర్‌గా అర్హత సాధించిన వ్యక్తిగా చట్టపరమైన అంశాలపై విశ్లేషణ చేసే హక్కు ఉందని, తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని ఆమె పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube