మా అమ్మ లేకపోతే ఈరోజు నేను లేను.. స్టార్ నటి ఎమోషనల్ కామెంట్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దీపికా పదుకొనే ఒకరు.ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మరొక స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.

 I Am Not Wherei Am Today If Not For My Mother Star Actress Emotional Comments St-TeluguStop.com

వివాహమైన తర్వాత కూడా దీపిక వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా అక్టోబర్ 10వ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈమె తమిళనాడులో జరగబోయే ఓ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఆంగ్ల మీడియాతో ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దీపిక ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలని మానసిక ఆరోగ్యం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

మనం మానసికంగా కృంగిపోతున్న సమయంలో మన కుటుంబం తోడు ఎంతో అవసరమని దీపిక తన జీవితంలో జరిగిన సంఘటన గురించి బయట పెట్టారు.ఒకానొక సమయంలో తాను ముంబైలో ఉండగా తన తల్లిదండ్రులు బెంగుళూరులో ఉండేవారని అయితే తను మానసిక ఆందోళనకు గురైనప్పుడు ఎంతో నరకం అనుభవించానని తెలిపారు.

బెంగళూరు నుంచి తన తల్లిదండ్రులు తనని చూడటానికి వచ్చినప్పుడు తాను బాగున్నానని నటించేదాన్ని అయితే ఈ విషయం అమ్మ గుర్తించి తనను నిలదీయగా తన బాధ మొత్తం అమ్మకు చెప్పగా అమ్మ నాకు ఆ సమయంలో ఎంతో సహాయంగా ఉండి తనని మానసికంగా దృఢంగా తయారయ్యేలా చేశారని తెలిపారు.ఆరోజు అమ్మ కనుక లేకపోతే నేను ఈరోజు మీ ముందు ఉండేదాన్ని కాదు అమ్మని దేవుడే తన దగ్గరకు పంపించారని ఈ సందర్భంగా దీపిక గతంలో తాను అనుభవించిన నరకం గుర్తుచేసుకొని ఎమోషనల్ కామెంట్ చేశారు.ఇక దీపిక సినిమాల విషయానికొస్తే ఈమె ప్రభాస్ నటిస్తున్నటువంటి ప్రాజెక్ట్ కే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube