తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.ఇలా ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావాలంటే ఎంతో సహనం ఓర్పు ఉండాలి ఇలాంటివి మెగాస్టార్ లో మెండుగా ఉన్నాయని చెప్పాల్సిన పనిలేదు.
ఎంత విసిగించిన ఎంతో ఓర్పుగా అందరికీ సమాధానాలు చెబుతూ ఉండే మెగాస్టార్ చిరంజీవి ఎవరిపై పెద్దగా కోపం వ్యక్తం చేయరు అయితే తాజాగా ఈయన గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ మీడియాపై తీవ్రస్థాయిలో చిందులు వేశారు.
ఈ విధంగా చిరంజీవి మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా మీడియా గురించి మాట్లాడుతూ మీడియా అంటే అందరికీ అందుబాటులో అందరికీ సహాయం చేసేలా ఉండాలి.కానీ మీడియా వారు మాత్రం ప్రతి ఒక్కరిలో కాన్ఫిడెన్స్ తగ్గించేలా చేస్తున్నారని ఈయన మండిపడ్డారు.
ఇలా తమలో కాన్ఫిడెన్స్ తగ్గించడమే కాకుండా మేము ఏం చేయాలో కూడా మీడియా వారే నిర్ణయించడం జరుగుతుంది అంటూ ఈయన వెల్లడించారు.

అనంతపురంలో జరిగిన గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ వేడుక గురించి ఈయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్ళాము అయితే కార్యక్రమం జరుగుతున్న సమయంలో జోరు వాన ఈ వర్షంలో కూడా తాను స్పీచ్ ఇస్తూ వచ్చాను అలా కాకుండా నేను మధ్యలో ఆపి వచ్చి ఉంటే మీడియా మరోలా ప్రచారం చేసి ఉండేదని మీడియాపై ధ్వజమెత్తారు.ఇలా మీడియా ఏ విషయం అయినా తమకు అనుకూలంగా రాసి ఇతరులను పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని మొదటిసారి మీడియాపై చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







