కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 14న ఏపీలోకి ప్రవేశించనుంది.ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న యాత్ర… అనంతపురం జిల్లా డీ హీరేహాల్‌కు చేరనుంది.
డీ హీరేహాల్ నుంచి ప్రారంభం కానున్న రాహుల్ యాత్ర.ఈ నెల 21 దాకా రాష్ట్రంలోనే కొనసాగనుంది.
ఈ నెల 14న జరిగే యాత్ర తర్వాత రాహుల్ తన పాదయాత్రకు 4 రోజుల పాటు విరామం ఇవ్వనున్నారు.ఆ తర్వాత తిరిగి 18న ఏపీలో యాత్రను కొనసాగించనున్నారు.
ఈ మేరకు ఏపీసీసీ నేతలు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి యాత్ర రూట్‌మ్యాప్‌ను అందజేశారు.







