కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వచ్చిన సినిమా ది ఘోస్ట్.దసరా సందర్భంగా రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.
టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమా బోల్తా కొట్టిందని చెప్పొచ్చు.ఓ పక్క మెగా గాడ్ ఫాదర్ కలక్షన్స్ అదరగొడుతుంటే నాగార్జున ఘోస్ట్ మాత్రం చతికిల పడ్డది.
అయితే సినిమా ఫెయిల్యూర్ కి కారణాలు అన్వేశించే పనిలో ఉన్నారు నాగార్జున.
సినిమా కోసం నాగార్జున రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా కొన్ని ఏరియాల రైట్స్ సొంతం చేసుకున్నారట.
అయితే రిజల్ట్ తేడా కొట్టడంతో అక్కడ వసూళ్లు కూడా పెద్దగా రాలేదట.నాగార్జున ది ఘోస్ట్ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ బాగానే అమ్ముడుపోగా థియేట్రికల్ రైట్స్ లోనే భారీ లాస్ తప్పేలా లేదని అంటున్నారు.
సినిమాలో మ్యాటర్ ఉన్నా సరే సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్లే ఆడియన్స్ కి రీచ్ అవలేదని టాక్.నాగార్జున కూడా ఈ విషయంలో తీవ్రమైన ఆలోచనలో పడ్డారట.
ఇక మీదట తన సినిమాల విషయంలో ప్రమోషన్స్ భారీగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట.







