సంక్రాంతి అంటేనే మన తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ అనే చెప్పాలి.ఈ పండుగకు భారీ సినిమాలు రిలీజ్ అవుతాయి.
పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లను ఈ పండుగకు ఫిక్స్ చేసుకుంటారు.ఎందుకంటే పండుగ సీజన్ లో కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మోత మోగించడం ఖాయం.
అందుకే సంక్రాంతి పండుగనే టార్గెట్ చేసుకుని తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు స్టార్స్.
మరి ఈసారి 2023 కు కూడా స్టార్స్ తమ సినిమాలను బరిలోకి దింపేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఈసారి కూడా భారీ పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు.ఇప్పటికే మన స్టార్స్ ఇద్దరు సంక్రాంతి బరిలో తమ సినిమాలు ఉన్నాయని ప్రకటించారు.ప్రభాస్ నటించిన భారీ సినిమా ఆదిపురుష్.ఈ సినిమా సంక్రాంతికి బిగ్గెస్ట్ రిలీజ్ చేస్తున్నారు.
ఇక మరొక సినిమా వాల్తేరు వీరయ్య.బాబీ దర్శకత్వంలో మెగా స్టార్ చేస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికే అని ప్రకటించారు.
అలాగే నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కూడా ఇదే సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరి ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ ఒకేసారి పోటీ పడితే ఏదో ఒక సినిమాపై ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంది.అందుకే ఈ బరిలో నుండి ఒకరు తప్పుకుంటున్నారు అని టాక్.ప్రభాస్ అయితే ఎప్పుడో ప్రకటించాడు కాబట్టి ఇతడు తగ్గే అవకాశం లేదు.
మెగాస్టార్ సినిమా కానీ బాలయ్య సినిమా కానీ వాయిదా పడే అవకాశం ఉంది.బాలయ్య సినిమా ఇప్పటికే చివరి దశకు చేరుకుంది కాబట్టి ఈ సినిమా సంక్రాంతి కంటే ముందే రావచ్చు అని అంటున్నారు.
ముందే అంటే క్రిస్మస్ కానుకగా వచ్చే అవకాశం ఉంది.చూడాలి ఈ పోటీలో ఎవరు తగ్గుతారో ఎవరు నెగ్గుతారో.







