టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అతి తక్కువ సమయంలోనే అగ్రతారక పేరు పొందారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం జరిగింది.ఇకపోతే సమంత ప్రస్తుతం ఒంటరిగా జీవితాన్ని గడుపుతో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే గత కొన్ని నెలల నుంచి సమంత సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నారు.
ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి సమంత కేవలం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే తెలియజేసేవారు తన వ్యక్తిగత విషయాల పట్ల సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే సమంత తన పెంపుడు శునకం ఫోటోని షేర్ చేస్తూ వెనక్కి తగ్గ కానీ ఓడిపోలేదు అంటూ క్యాప్షన్ పెట్టారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఈ పోస్ట్ పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మోర్ పవర్ టు యూ, బీ స్ట్రాంగ్ అనే అర్థం వచ్చేలా ఎమోజీలతో కామెంట్స్ పెట్టారు.దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.సమంత తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ పెట్టారని భావించిన కొందరు అభిమానులు ఏమైంది మేడం.
ధైర్యంగా ఉండండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.
ఈమె ప్రస్తుతం యశోద ఖుషి సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు.అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.







