ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది.కాగా ఎన్నో ఉత్కంఠల తర్వాత ఈ ఎన్నికకు మొత్తం ముగ్గురు సీనియర్ నేతలు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లతో పాటు జార్ఖండ్ మాజీ మంత్రి కెఎన్ త్రిపాఠి నామినేషన్లను దాఖలు చేశారు.అయితే, త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది.
దీంతో ఖర్గే, శశిథరూర్ మధ్య ద్విముఖ పోరు ఉండనుంది.ఈ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది.







