బిగ్ బాస్ 6 : మిస్టర్ కూల్ కి కోపం వచ్చేసింది..!

బిగ్ బాస్ సీజన్ 6 లో భాగంగా ఐదువారాలుగా ఆట నడుస్తున్నా హౌస్ లో మిస్టర్ కూల్ గా ఉంటూ అందరిని అలరిస్తున్నాడు బాలాదిత్య.చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు పరిచయమై.

 Biggboss 6 Mister Cool Baladitya Fires On Geethu Royal Details, Baladitya, Bb6 B-TeluguStop.com

హీరోగా కూడా సినిమాలు చేసిన బాలాదిత్య హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి చాలా సైలెంట్ గా ప్రతి విషయాన్ని అందరికి నెమ్మదిగా చెబుతూ మిస్టర్ కూల్ అనే పేరు తెచ్చుకున్నాడు.అయితే అతని ఆటని సేఫ్ గేమ్ అన్న వారు కూడా ఉన్నారు.

ఎవరెలా అనుకున్నా నేను ఇంతే అన్నట్టుగా ఉంటూ వచ్చాడు బాలాదిత్య.

అయితే అలా సైలెంట్ గా ఉండటం వల్ల కూడా ఆడియన్స్ తనని గుర్తించట్లేదని అర్ధమైందో ఏమో కానీ సడెన్ గా లేటెస్ట్ టాస్క్ లో బాలాదిత్యకి కోపం వచ్చింది.

అది కూడా అతను చెల్లి అని పిలిచే గీతు రాయల్ మీద కోపం వచ్చింది.ఆమె అతని ఆటని డిస్ట్రబ్ చేస్తున్న కారణంగా ఓపిక పట్టి పట్టీ ఫైనల్ గా ఆమె మీద గొంతు విప్పాడు బాలాదిత్య.

సో ఇన్నాళ్లు అతని కోపాన్ని అణచుకున్న బాలాదిత్య కూడా బిగ్ బాస్ వల్ల కోపాన్ని తెచ్చుకున్నాడు.నేడు జరగనున్న ఎపిసోడ్ లో అన్నిటికన్నా హైలెట్ బాలాదిత్య ఫైర్ అవడమే అని చెప్పొచ్చు.మరి మిస్టర్ కూల్ కి అసలు కోపం ఎందుకు వచ్చిందో ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube