తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.స్పష్టమైన జాతీయ విధానం ప్రకటించకుండా జాతీయ పార్టీ పెట్టారని మండిపడ్డారు.
అక్రమంగా సంపాదించినా, ప్రజల వద్ద నుంచి దోచుకున్న సొమ్ముతో ఏపీలో ఫ్లెక్సీలు కడుతున్నారని ఆరోపించారు.ఎందరో మహానీయుల విగ్రహాలను ధ్వంసం చేశారన్న విష్ణువర్ధన్ రెడ్డి.
వీరి కుటుంబాలతో పాటు తెలుగు తల్లికి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీకి, కేసీఆర్ పార్టీకి తేడా లేదని ఎద్దేవా చేశారు.







