తామొక స్టార్స్ అయినా కూడా కొందరు హీరోలు.హీరోయిన్స్ తమకు ఇష్టమైన హీరోల గురించి.
హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు.వారు ఫ్యాన్ బోయ్ మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తారు.
ఇదే క్రమంలో తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పి సర్ ప్రైజ్ చేసింది యువ కథానాయిక వర్ష బొల్లమ్మ.తమిళ సినిమా 96లో నటించిన ఆమె అదే సినిమా తెలుగు రీమేక్ జాను లో కూడా నటించింది.
ఆ తర్వాత తెలుగులో సోలో హీరోయిన్ గా వరుస ఛాన్సులు అందుకుంటుంది.నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ యువతని ఆకట్టుకుంటుంది వర్ష.
లేటెస్ట్ గా ఆమె స్వాతిముత్యం సినిమాలో నటించింది.బెల్లంకొండ గణేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో వర్ష తన నటనతో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకు ఇష్టమైన హీరో ఎన్.టి.ఆర్ అని చెప్పింది వర్ష.ఎన్.టి.ఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన జీవిత ఆశయం అన్నది.అలాంటి ఛాన్స్ వస్తే తప్పకుండా ఎగిరి గంతులేస్తా అంటుంది అమ్మడు.ఎన్.టి.ఆర్ నటన, ఆయన డ్యాన్స్ అన్ని తనకు చాలా ఇష్టమని చెప్పింది.RRR సినిమాలో ఆయన చేసిన కొమరం భీమ్ పాత్ర కూడా తనకు బాగా నచ్చిందని చెప్పింది.ఎన్.టి.ఆర్ తో నటించడానికి తాను రెడీ అంటూ చెబుతుంది వర్ష.







