ఇలాంటి కధలను విన్నప్పుడల్లా ప్రేమ గుడ్డిదని నమ్మబుద్దేస్తుంది.అవును, 78 ఏళ్ల వృద్ధుడిని 18 ఏళ్ల యువతి ఏరకంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటుందో ఆ దేవుడికే తెలియాలి.
పైగా మనిషిని చూసి కాదు.మనస్సును చూసి కలుగుతుంది ప్రేమ అని అంటూవుంటారు కొంతమంది ప్రబుద్ధులు.
ఇపుడు ఈ ప్రేమ గొడవ ఎందుకంటే వారి పెళ్ళికి కారణం ప్రేమ కాబట్టి.అవును, 78 ఏళ్ల వృద్ధుడిని మనువాడి, వార్తల్లోకెక్కింది ఓ 18 ఏళ్ల యువతి.
ఆ యువతికి 15 ఏళ్ల వయస్సు ఉండగానే వారిద్దరూ ఈ ప్రేమ ప్రయాణం ప్రారంభించారట.
ఈ తాత ఏమి ఆశ చుపించాడో తెలియదు కానీ, ఆ తాతనే మనువాడుతానని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ అమ్మాయి తెగేసి చెప్పిందట.
దాంతో ఇక చేసేదేమి లేక ఇరు కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం గమనార్హం.దీంతో ఈ పెళ్లి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.
అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ వింత పెళ్లి ఫిలిప్పీన్స్‌లో జరిగింది.రషద్ మంగాకోప్ అనే 78 ఏళ్ల రైతు 18 ఏళ్ల హలీమా అబ్దుల్లాను మొదటి సారిగా కగాయన్ ప్రావిన్స్ లో ఓ విందు సందర్భంగా మొదటి సారిగా కలుసుకున్నారు.
దీంతో అప్పుడే వారి మధ్య పరిచయం ఏర్పడింది.

అదే సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది.అప్పటి నుంచి వారిద్దరూ మూడేళ్లపాటు సహజీవనం చేశారట.ఆ తరువాత ఈ ఏడాది ఆగస్టు 25 న ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
ఈ పెళ్లి ఇరు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలుపలేదు.అయితే వారిద్దరికీ ఇది మొదటి ప్రేమ.రషీద్ ఇంత వరకు ఎవరినీ ప్రేమించలేదు.అలాగే పెళ్లి కూడా చేసుకోలేదు.
ఈ పెళ్లిపై రాషెడ్ మేనల్లుడు బెన్ మంగాకోప్ మాట్లాడుతూ.ఇది పెద్దలు కుదర్చిన పెళ్లి కాదని, వారిద్దరూ పూర్తి ఇష్టంతో పెళ్లి చేసుకున్నారని చెప్పారు.
తన తల్లి సోదరుడు వరుడు అయ్యాడని ఆనందం వ్యక్తం చేశాడు.







