సామాజిక మాధ్యమం ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి టెస్లా అధినేత ఎలన్ మస్క్ మళ్లీ రెడీ అయినట్లు తెలుస్తోంది.న్యాయ వివాదాన్ని కొనసాగించకుండా ఈ డీల్ ను ఎలా అయినా పూర్తి చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు.అయితే, ఈ ఏప్రిల్‌లో ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను వంద శాతం కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు.కానీ, తర్వాత ఈ డీల్ ను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపి అందరికీ షాకిచ్చారు.దీనిపై తమ కంపెనీ షేర్లు నష్టపోయాయని మస్క్ పై ట్విట్టర్ న్యాయ పోరాటం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరు పార్టీలు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది.దీనిలో భాగంగా వీలైనంత త్వరగా డీల్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.
మస్క్ ప్రతిపాదన తర్వాత ట్విట్టర్ షేరు భారీగా పెరిగింది.







