బార్లీ గింజ‌ల‌ను ఇలా తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు మ‌రెన్నో బెనిఫిట్స్‌!

బార్లీ గింజలు.వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.వేసవిలో వీటి వినియోగం అత్యధికంగా ఉంటుంది.శరీరంలోని అధిక వేడిని తగ్గించుకునేందుకు, తక్షణ శక్తిని పొందేందుకు బార్లీ వాటర్, బార్లీ జావ వంటివి తీసుకుంటుంటారు.అయితే ఏ సీజన్లో అయినా బార్లీ గింజల‌ను తీసుకోవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా బార్లీ గింజల‌ను తీసుకుంటే వేగంగా బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల‌ను సైతం పొందొచ్చు.

 Consuming Barley Seeds In This Way Not Only Reduces Weight Also Has Many Other B-TeluguStop.com

మ‌రి ఇంకెందుకు లేటు బార్లీ గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో చిన్న కప్పు బార్లీ గింజలను వేసుకుని రెండు లేదా మూడు సార్లు వాటర్ తో శుభ్రంగా కడగాలి.

ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే స్టవ్‌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వ‌గానే అందులో నానబెట్టుకున్న బార్లీ గింజలు వేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఉడికించి చల్లారిన పెట్టుకొన్న బార్లీ, ఒక అరటి పండు, ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ పీనట్ బట‌ర్‌, నాలుగు నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ బార్లీ స్మూతి సిద్ధమవుతోంది.

Telugu Barley Seeds, Barleyseeds, Tips, Latest-Telugu Health Tips

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ సమయంలో ఈ స్మూతీని తీసుకుంటే కనుక వేగంగా వెయిట్ లాస్ అవుతారు.ఎముకలు బలంగా మరియు దృఢంగా మారుతాయి.హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.చర్మం నిగారింపు గా మారుతుంది.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

మరియు ఈ స్మూతీ ని తీసుకోవడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సైతం దూరం అవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube