నేటి నుంచి హైదరాబాద్ లో ఆపరేషన్ రోప్ పనులు ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఆపరేషన్ రోప్ పనులు జరగనున్నాయని నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఈ మేరకు పనుల అమలును ఆయన స్వయంగా పర్యవేక్షించారు.అదేవిధంగా 3 లేదా నాలుగు రోజుల్లో వాహనదారులకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం చలాన్లను మూడు రోజుల తర్వాత విధిస్తామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.ఈ క్రమంలో వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.







