మహాత్మా గాంధీకి ఘన నివాళి

సూర్యాపేట జిల్లా:మహాత్మాగాంధీ 153 వ,జయంతి సందర్భంగా ఆదివారం కుడకుడ రోడ్డులోని మహాత్మ గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కేశవ్ హేమంత్ పాటిల్,మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ ఆశయసాధనలో శాంతియుతంగా యువత జీవించాలన్నారు.

 Tribute To Mahatma Gandhi-TeluguStop.com

అదేవిధంగా మహాత్మా గాంధీ ఆశయ సాధనలో పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహాత్మా గాంధీ ఆశయాలను నిజం చేస్తున్నారని,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సారధ్యంలో సూర్యాపేట పట్టణం దినదినాభివృద్ధి దిశలో కొనసాగుతుందని కొనియాడారు.

అనంతరం ఆర్యవైశ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్మికులకు హ్యాండ్ బ్లౌజెస్ మరియు సూర్యాపేట సబ్ జైల్ లో 60 మంది ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలిత ఆనంద్,కౌన్సిలర్లు సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ,కక్కిరేణి శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి,సూర్యాపేట పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సవరాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్,గండూరి కృపాకర్,బావు సింగ్, కో ఆప్షన్ నెంబర్ వెంపటి సురేష్,ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు మాశెట్టి అనంతరాములు,కార్యదర్శి బండారు రాజా,జిల్లా మహిళా ఆర్యవైశ్య అధ్యక్షురాలు గుండా శ్రీదేవి,సూర్యాపేట పట్టణ అధ్యక్షురాలు కలకోట అనిత,టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,ఆర్యవైశ్య కమిటీ సభ్యులు,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube