టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా నటించిన చిత్రం ది ఘోస్ట్.ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇకపోతే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ హీరోయిన్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ ఫిలిమ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే డైరెక్టర్ మాట్లాడుతూ.‘ది ఘోస్ట్’ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంది.ఈ క్రమంలోనే ఇలాంటి యాక్షన్స్ సన్ని వేషాలలో నటించడానికి హీరోయిన్లు ఎంపిక విషయంలో చాలా ఇబ్బందిగా మారిందని, ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక చేయడం కోసం చాలా ఇబ్బందులు పడ్డామని డైరెక్టర్ తెలిపారు.
తొలుత ఈ సినిమాకు హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసాం అయితే ఈమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో శృతిహాసన్, అమలపాల్, జాక్వెలిన్ వంటి హీరోయిన్లను సంప్రదించామని అయితే వీళ్లంతా బిజీగా ఉండటం వల్ల ఎవరు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు అని తెలిపారు.

ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి యాక్షన్స్ సన్ని వేషాలలో నటించడం కోసం హీరోయిన్లు దొరకడం చాలా కష్టంగా ఉందనీ తెలిపారు.కాజల్ తప్పుకోవడంతో ఈ సినిమాలో నటించడానికి ఎంతో శ్రమించాము చివరికి సోనాల్ చౌహన్ ఫైనల్ అయింది అంటూ ఈ సందర్భంగా ప్రవీణ్ సత్తార్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుత కాలంలో యాక్షన్ సినిమాలకు డిమాండ్ పెరగడంతో హీరోయిన్లు కూడా యాక్షన్ సన్నీ వేషాలలో నటించడానికి సిద్ధం కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా డైరెక్టర్ వెల్లడించారు.







