రైతు,మహిళా వ్యతిరేకి కేసీఆర్:ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు, మహిళా వ్యతిరేకి అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం జరిగిన హుజూర్‌నగర్ మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.

 Anti-farmer, Anti-woman Kcr: Uttam-TeluguStop.com

అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ 2018 డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ.లక్ష రైతు రుణమాఫీ ఏమైందన్నారు.కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలోని రైతులకు ఎలాంటి పంటల బీమా లేదని,అధిక వర్షాలు,వడగళ్ల వానలు,వరదలు, తెగుళ్ల దాడి మొదలైన సమయాల్లో పూర్తిగా రైతాంగం నష్టపోతుందన్నారు.తెలంగాణ ప్రభుత్వం మహిళలను కూడా మోసం చేస్తోందని,స్వయం సహాయక సభ్యులు వడ్డీ లేని రుణం అమలు చేయడం లేదని,విఎల్ఆర్ పథకం కింద,రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల మహిళా సంఘాల సభ్యులకు కేసీఆర్ ప్రభుత్వం రూ.3000 కోట్ల పైగా బకాయి ఉందన్నారు.ఎన్‌ఎస్‌పి ఎడమ కాలువపై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల నిర్వహణను ప్రభుత్వం చేపడుతుందన్న తన హామీని కేసీఆర్ తప్పక నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube