సూర్యాపేట జిల్లా:ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు, మహిళా వ్యతిరేకి అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
శనివారం జరిగిన హుజూర్‌నగర్ మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.
అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ 2018 డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ.
లక్ష రైతు రుణమాఫీ ఏమైందన్నారు.కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలోని రైతులకు ఎలాంటి పంటల బీమా లేదని,అధిక వర్షాలు,వడగళ్ల వానలు,వరదలు, తెగుళ్ల దాడి మొదలైన సమయాల్లో పూర్తిగా రైతాంగం నష్టపోతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలను కూడా మోసం చేస్తోందని,స్వయం సహాయక సభ్యులు వడ్డీ లేని రుణం అమలు చేయడం లేదని,విఎల్ఆర్ పథకం కింద,రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల మహిళా సంఘాల సభ్యులకు కేసీఆర్ ప్రభుత్వం రూ.
3000 కోట్ల పైగా బకాయి ఉందన్నారు.ఎన్‌ఎస్‌పి ఎడమ కాలువపై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల నిర్వహణను ప్రభుత్వం చేపడుతుందన్న తన హామీని కేసీఆర్ తప్పక నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
టీచర్ స్పీడ్ చూస్తే మైండ్ బ్లాకే.. OMR షీట్స్ ఎలా చెక్ చేస్తున్నాడో మీరే చూడండి!