వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.కాకినాడలో వికేంద్రీకరణకు మద్ధతుగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో వికేంద్రీకరణ అంశాలను పెట్టామన్నారు.రాష్ట్ర సంపదను ల్యాండ్ పూలింగ్ పేరుతో 29 గ్రాామాల్లో పెట్టారని తెలిపారు.
ల్యాండ్ ఇచ్చిన వారికి అగ్రిమెంట్ ప్రకారం చేస్తామని పేర్కొన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దోపిడీ దారులు పాదయాత్రగా వస్తున్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబుకు, లోకేష్ కు జై అని పాదయాత్ర ప్రారంభించారని, రాష్ట్రంలో జరుగుతున్న కుట్రను అడ్డుకోవాలని చెప్పారు.రైతుల ముసుగులో చేస్తున్న టీడీపీ యాత్రకు బుద్ధి చెప్పాలని మంత్రి బొత్స పిలుపునిచ్చారు.