'అల్లు' స్టూడియోస్ లాభాల కోసం కాదు.. బ్రాండ్ నిలబెట్టడం కోసం : చిరు

మన టాలీవుడ్ లో పెద్ద కుటుంబాలు చాలానే ఉన్నాయి.అందులో అన్ని కుటుంబాలు ఒకప్పుడు స్టూడియోలు ఏర్పాటు చేసారు.

 Megastar Chiranjeevi Garu Will Be Launching Allu Studios, Allu Studios, Allu Fam-TeluguStop.com

అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోను, దగ్గుబాటి కుటుంబానికి రామానాయుడు స్టూడియో, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి పద్మాలయ స్టూడియో, ఎన్టీఆర్ ఫ్యామిలీకి రామకృష్ణ హార్టీకల్చరల్ స్టూడియోలు ఉన్న విషయం తెలిసిందే.అయితే తెలుగులో పెద్ద ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీకి కానీ మెగా ఫ్యామిలీకి సంబందించిన అల్లు ఫ్యామిలీకి కానీ స్టూడియో అనేది ఇప్పటి వరకు లేదు అనే చెప్పాలి.

అందుకే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ కూడా స్టూడియో ఏర్పాటు చేసారు.అల్లు స్టూడియోస్ పేరుతో ఆధునిక వసతులతో సర్వాంగ సుందరంగా అన్ని హంగులను కలగలిపి వెబ్ సిరీస్ లకు, రియాలిటీ షోలకు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు అనువుగా ఉండేలా ఈ స్టూడియోను అల్లు ఫ్యామిలీ అందుబాటులోకి తీసుకొస్తుంది.

స్టూడియో ఓపెనింగ్ ఈ రోజు ఘనంగా జరిగింది.అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా చిరంజీవి చేతుల మీదుగా ఈ స్టూడియో గ్రాండ్ గా ఓపెనింగ్ జరిగింది.

ఇక ఈ స్టూడియోను ప్రారంభించి చిరు అల్లు ఫ్యామిలీని అభినందించారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.మావయ్య అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించు కుంటూ నివాళి అర్పిస్తున్నట్టు తెలిపారు.ఇలాంటి ఘనత కొంత మందికి మాత్రమే లభిస్తుంది అని ఆయన వేసిన బయటలో ఆయన కుమారుడు అల్లు అరవింద్ నిర్మాతగా ఆయన మనవళ్లు కూడా ఇదే రంగంలో రాణిస్తున్నారు.

ఇక ఈ స్టూడియో లాభాపేక్ష కోసం ఏర్పాటు చేయలేదన లాభాపేక్ష కంటే కూడా ఒక స్టేటస్ సింబల్.ఒక గుర్తింపు.ఈ తరమే కాదు రాబోయే తరాలు కూడా ఆయనను అందరు తలచుకునేందుకు అల్లు బ్రాండ్ ను నిలబెట్టడం కోసం దీనిని నిర్మించారని నేను భావిస్తున్నాను అంటూ చిరు తెలిపారు. గాడ్ ఫాదర్ ఈవెంట్ కోసం ముంబై వెళ్తున్న అని అక్కడ మరిన్ని మనసులోని మాటలు చెబుతానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube