ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ పోస్టర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అక్టోబర్ రెండవ తారీఖున సినిమా యొక్క టీజర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ సభ్యులు పోస్టర్ విడుదల చేయడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
పోస్టర్ లో ప్రభాస్ అద్భుతమైన ఫోజ్ ఇచ్చి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు, విల్లు ఎక్కుపెట్టిన రాముడు అన్నట్లుగా ప్రభాస్ ని చూస్తుంటే అనిపిస్తుంది.ఈ సినిమా లో నిజంగానే ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఇక టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి కొన్ని నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కూడా విల్లు ఎక్కు పెట్టిన పోస్టర్ మంచి ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ రెండు పోస్టర్స్ నీ పక్క పక్కన పెట్టి అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఏ హీరో ఎంత బాగా ఉన్నాడు. ఏ హీరో రాముడి పాత్రకు సరిగ్గా సూట్ అవుతున్నాడు అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు.మెగా అభిమానులు రామ్ చరణ్ సూట్ అయినంతగా ప్రభాస్ సెట్ అవ్వలేక పోయాడు పాపం అంటూ కామెంట్ చేస్తే.ప్రభాస్ ఫిజిక్ ముందు రామ్ చరణ్ రాముడిగా తేలిపోయాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
నిజానికి రామ్ చరణ్ వేసిన గెటప్ అల్లూరి సీతారామ రాజు గెటప్.అయినా కూడా ఎక్కువ మంది ఉత్తరాది ప్రేక్షకులు ఆ గెటప్ ని రాముడి గెటప్ గానే భావిస్తున్నారు.
రాముడి పాత్రలో రామ్ చరణ్ నటించిన ప్రచారం కూడా జరిగింది.మొత్తానికి అల్లూరిగా రామ్ చరణ్ ఆ సినిమా లో మంచి లుక్ తో కనిపించి మెప్పించాడు, అలాగే రామ్ చరణ్ కి ఏమాత్రం తగ్గకుండా ప్రభాస్ కూడా ఆదిపురుష్ సినిమా తో మెప్పించే అవకాశం ఉందని ఈ పోస్టర్ ని చూస్తుంటే అనిపిస్తుంది.
ఈ రెండు పోస్టర్లలో ఇద్దరు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు అనడంలో సందేహం లేదు.







