బాలీవుడ్ పరువు మళ్లీ పోయింది, మల్టీస్టారర్ సినిమా అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసిన విక్రం వేద సినిమా కు మొదటి రోజు వచ్చిన వసూళ్లు బాలీవుడ్ సినిమాల పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి.దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విక్రమ్ వేద సినిమా కేవలం 12 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసింది.
ఈ మధ్య కాలం లో తెలుగు మీడియం రేంజ్ హీరోల సినిమాల మినిమంగా 10 కోట్లకు మించి వసూళ్లు ఉంటున్నాయి.అలాంటిది బాలీవుడ్ సినిమా కేవలం రూ.12 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అంటే పరిస్థితి అక్కడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు ఇంకో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కలిసి నటించిన సినిమా అయినా కూడా ఓపెనింగ్స్ మరీ ఇంత దారుణం గా ఉండడం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆ మధ్య విడుదలైన బ్రహ్మాస్త్ర కాస్త పరవాలేదు అనిపించినా.ఆ తర్వాత వస్తున్న సినిమాలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి.కలెక్షన్స్ రాబట్టడం లో ప్రతి సినిమా ఒకే దారిలో వెళ్తున్నాయి.వందల కోట్ల వసూళ్ల ను ఒకప్పుడు దక్కించుకున్న హిందీ సినిమా లు ఇప్పుడు 10 నుండి 15 కోట్ల మొదటి రోజు కలెక్షన్స్ రాబట్టడానికే నానా కష్టాలు పడాల్సి వస్తుంది.
విక్రమ్ వేద సినిమా దాదాపుగా 150 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.కనీసం రూ.100 కోట్లు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదంటూ అంటూ బాక్స్ ఆఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పరిస్థితి ఇలాగే ఉంటే ముందు ముందు థియేట్రికల్ రిలీజ్ ఉండక పోవచ్చు అంటూ బాలీవుడ్ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







