ఎప్పుడు నవ్వుతూ సరదాగా కనిపించే మహేష్ బాబు ఇటీవల తల్లి ఆకస్మిక మరణంతో విషాదంలో మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే.అనారోగ్యంతో బాధపడిన ఇందిరాదేవి ఇటీవలే ఆసుపత్రిలో కన్నుమూశారు.ఇక ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.
2014లో జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ యాక్సిడెంట్లో మరణించారు అన్న విషయం తెలిసిందే.ఇక అలాగే కొన్ని నెలల క్రితం మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా అనారోగ్యంతో మరణించారు.
ఇక అన్నయ్య చనిపోయిన నాలుగేళ్ల తర్వాత ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
అలాగే అన్నయ్య చనిపోయాడు అన్న బాధ నుంచి బయటపడేలోపే ఇక మహేష్ బాబు తల్లి మరణించారు.

హరికృష్ణ మరణించి సమయానికి ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్లో ఉన్నారు.తర్వాత రాజమౌళితో సినిమా చేశాడు.ఇక ప్రస్తుతం మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.అంతేకాదు అప్పుడు ఎన్టీఆర్కు ఇప్పుడు మహేష్ బాబుకు కూడా త్రివిక్రమ్ తో సినిమా 28వది కావటం గమనార్హం.

ఇలా మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న ఈ పోలికలు ప్రస్తుతం అభిమానులందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అని చెప్పాలి.ఇన్నాళ్లు ఇక ఇలాంటి పోలికలను మేము గమనించలేదు కానీ ఇద్దరు జీవితంలో కూడా ఒకే రకమైన ఘటనలు జరిగాయని.అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు ఎంతోమంది అభిమానులు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు లకు సంబంధించిన ఈ విషయాలు మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.







