మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరిగిన విషయం తెలిసిందే.మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ ఈవెంట్ లో వర్షం కొద్దిగా అంతరాయాన్ని కలిగించింది.
అయితే చిరు వర్షం పడుతున్నా సరే ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడారు.అంతేకాదు సినిమా తప్పకుండా మీ అంచనాలను అందుకుంటుందని అన్నారు.
అయితే గాడ్ ఫాదర్ ఈవెంట్ లో సెల్ ఫోన్లు చోరీ హాట్ న్యూస్ అయ్యింది.

ఈవెంట్ లో దాదాపు 300 దాకా సెల్ ఫోన్లు పోయాయని టాక్.కొందరు ఆన్ లైన్ లో కంప్లైంట్ ఇస్తే.కొందరు రిటెన్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారట.మొత్తంగా మెగా ఫ్యాన్స్ అందరు తమ సెల్ ఫోన్ల కంప్లైంట్స్ తో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తుంది.300 ఫోట్లు పోవడం అంటే అది చిన్న విషయం ఏమి కాదు.గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ అవుతుంది.ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.మోహన్ రాజా డైరక్షన్ లో తెరకెక్కిన ఈ గాడ్ ఫాదర్ సినిమా మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా వస్తుంది.







