మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గాడ్ ఫాథర్.మరొక ఆరు రోజుల్లో దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అందరి అటెన్షన్ నెలకొనింది.
ఆచార్య ప్లాప్ తర్వాత ఈ సినిమాతో మెగాస్టార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అందుకే ఈ సినిమా విషయంలో అంతా కూడా ఆతృతగా ఉన్నారు.
మరి ఈ సినిమా అయినా ఆచార్య ప్లాప్ ను మరిపించే బ్లాక్ బస్టర్ అవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఫుల్ ఫోకస్ పెట్టి ఈ సినిమా ప్రొమోషన్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.అనంతపురం లోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో ఈ ఈవెంట్ ఫ్యాన్స్ మధ్య అట్టహాసంగా జరిగింది.
ఈ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది.ఈయన ఫ్యాన్స్ కోసం మాట్లాడిన నాలుగు మాటలు వారికీ చాలా ఆనందాన్ని కలిగించాయి.

ఎన్నో విషయాలను ఫ్యాన్స్ తో పంచుకున్న మెగాస్టార్ చివరిగా ”నా గుండె లోతుల్లో నుండి చెప్తున్న మాటలు ఇవి అని.నేను ఇండస్ట్రీలోకి రావడానికి ఏ గాడ్ ఫాదర్ లేకపోవచ్చు కానీ.ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తూ వచ్చిన నా అభిమానులే నా గాడ్ ఫాదర్స్ అంటూ ఈయన స్పీచ్ ముగించడంతో ఈ గ్రౌండ్ అరుపులతో నిండి పోయింది.మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వారం రోజులు ఆగాల్సిందే.

ఇక తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంటే.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు.థమన్ సంగీతం అందించాడు.







