ఏపీలోని విశాఖలో ఉన్న సీబీఐ కోర్టునుల వేరే ప్రాంతాలకు తరలించనున్నారు.ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు ఇచ్చారు.
విశాఖలో ఉన్న రెండో అదనపు సీబీఐ కోర్టును కర్నూలుకు, మూడో అదనపు సీబీఐ కోర్టును విజయవాడకు తరలించనున్నారు.కాగా ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఈ ఆదేశాలను జారీ చేశారు.
ఈ నేపథ్యంలో కోర్టుల తరలింపునకు తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ, కర్నూలు, కృష్ణా జిల్లాల న్యాయమూర్తులకు సూచించారు.







